అనుబంధాల పండగ

Tue,November 5, 2019 12:10 AM

సాయితేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతిరోజు పండగే. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. డిసెంబర్ 20న ప్రేక్షకులముందుకురానుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించారు. జీవితం చరమాంకంలో ఉన్నప్పుడు నిరాశలో మునిగిపోకుండా మరణాన్ని కూడా ఓ ఉత్సవంలా జరుపుకోవాలనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాం. చక్కటి మానవీయ అంశాలున్న కథాంశమిది. కుటుంబ అనుబంధాలతో పాటు వినోదానికి పెద్దపీట వేశాం. మారుతి గత చిత్రాలకంటే డబుల్ వినోదం కలబోతగా సాగుతుంది. సాయితేజ్, రాశీఖన్నా కెమిస్ట్రీ అందరిని అలరిస్తుంది. కథానుగుణంగా చక్కటి పాటలు కుదిరాయి. ఈ సినిమా టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తున్నది. తమన్ సంగీతం, కె.కె. సాహిత్యం ఆకట్టుకుంటున్నది. విలువలు, వినోదాల మేళవింపుతో అన్ని వర్గాలను మెప్పించే చిత్రమిది అని చిత్రబృందం తెలిపింది. సత్యరాజ్, విజయకుమార్, రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జయకుమార్, సహనిర్మాత: ఎస్‌కేఎన్, రచన-దర్శకత్వం: మారుతి.

484

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles