తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఆర్.కె.గౌడ్


Sun,August 25, 2019 11:28 PM

pratani ramakrishna goud was unanimously elected as telangana film chamber

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ప్రతాని రామకృష్ణగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన సలహాదారుడిగా నిర్మాత ఎ.ఎం.రత్నం, ఉపాధ్యక్షులుగా గురురాజ్, రంగా రవీంద్ర గుప్తా, అలీభాయ్, సెక్రటరీలుగా కె.వి.రమణారెడ్డి, కె.సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీస్‌గా వి.మధు, పూసల కిషోర్, రవీంద్రగౌడ్, జాయింట్ సెక్రటరీలుగా సతీష్, నాగరాజు గౌడ్, శంకర్ గౌడ్, కోశాధికారిగా రామానుజం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కోసం భవనాన్ని నిర్మిస్తాం. పది ఎకరాల్లో సినీ కార్మికుల ఇళ్లకు స్థలం కేటాయిస్తాం. 24 విభాగాల కార్మికులకు పని దొరికేలా చూస్తాం అని చెప్పారు.

275

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles