కార్మికులకే కేటాయించాలి!


Thu,July 11, 2019 12:31 AM

pratani rama krishna goud on chitrapuri colony scams

చిత్రపురి పోరాట సమితి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం వుంది. 24 శాఖల్లో పనిచేస్తున్న సినీ కార్మికులకు కాకుండా సినిమాకు సంబంధంలేని వారికి ఇండ్లు కేటాయించారు. దాదాపు 5వేల కార్మికులకు ఇండ్లు కేటాయించాల్సి వుంది. 26 రోజులుగా దీక్షలు చేస్తున్నా చిత్రపురి హౌజింగ్ సొసైటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అన్నారు ప్రతాని రామకృష్ణగౌడ్. చిత్రపురి పోరాట సమితికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ చిత్రపురి హౌజింగ్ సొసైటీలో జరిగిన అవకతవకలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళతాం. అంతే కాకుండా సినీ కార్మికులకు కేటాయించిన స్థలాన్ని కైరోస్ స్కూల్‌కు కేటాయించడం చట్టవిరుద్ధం. వెంటనే ఆ స్కూల్‌ను తొలగించాలి. ప్రభుత్వం కేటాయించబోయే 9 ఎకరాలని చిత్రపురి పోరాట సమితికే కేటాయించాలి అన్నారు.

578

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles