ప్రశ్నించే నాయకుడు

Mon,February 4, 2019 10:44 PM

కాంబినేషన్ కంటే కథలను నమ్ముకుంటూ మనీష్ హీరోగా నిలదొక్కుకోవాలి. ప్రశ్నిస్తా చిత్రం అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాలి అని అన్నారు నిర్మాత సి.కల్యాణ్. మనీష్‌బాబు, అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్రశ్నిస్తా. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. పి.సత్యారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ లోగోను సోమవారం హైదరాబాద్‌లో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, దాసరి కిరణ్‌కుమార్, సి.కల్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ సందేశాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి అని పేర్కొన్నారు. నిర్మాత మాట్లాడుతూ క్షేమంగా వెళ్లి లాభంగా రండి సమయంలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తానని దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాటిచ్చారు. ఈ సినిమాతో ఆ మాటను నిలబెట్టుకున్నారు. సమాజంలోని అవినీతి, అక్రమాల్ని ప్రశ్నించే ఓ విద్యార్థి నాయకుడి కథ ఇది. ఈ పోరాటంలో అతడికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాన్నది ఆసక్తిని పంచుతుంది అని తెలిపారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా వినూత్న కథ, కథనాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు అన్నారు. . కథాబలమున్న మంచి సినిమాతో హీరోగా పరిచయం కానుండటం ఆనందంగా ఉంది మనీష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, అక్షిత తదితరులు పాల్గొన్నారు.

892

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles