పొలిటికల్ సినిమా కాదు!

Thu,February 21, 2019 11:27 PM

నటుడు, నిర్మాత, దర్శకుడు పి.సత్యారెడ్డి తనయుడు మనీష్‌బాబు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ప్రశ్నిస్తా. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. జనం ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అక్షిత, హసీనామస్తాన్‌మీర్జ కథానాయికలు. వెంగీ సంగీతం అందించిన ఈ చిత్ర టీజర్‌ని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ టీజర్ చూస్తుంటే రాజా వన్నెంరెడ్డి ైస్టెల్ మార్చినట్లుగా కనిపిస్తోంది. సత్యారెడ్డి తన కొడుకు మనీష్‌ను ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ కొత్త ప్రయత్నం ఫలించాలి అన్నారు. రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ సాధారణంగా నా సినిమాల్లో సున్నితమైన ఫ్యామిలీ అంశాలు, వినోదం వుంటాయి. అయితే ఈ సారి అందుకు భిన్నమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. అయితే ఇది పొలిటికల్ సినిమా కాదు . పెద్ద విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నాను అన్నారు.

975

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles