రాజకీయ చదరంగంలో


Mon,March 25, 2019 12:24 AM

Prashnistha Movie Audio Launch

మనీష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ప్రశ్నిస్తా. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. జనం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మిస్తున్నారు. వెంగీ స్వరాల్ని సమకూర్చిన ఈ చిత్ర గీతాలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబి) ఆడియోను ఆవిష్కరించారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ కథానాయకుడు మనీష్ ముంబయి, హైదరాబాద్, విశాఖపట్నంలలో శిక్షణ తీసుకొని ఈ సినిమాలో నటించాడు. తన పాత్రలో పూర్తిగా లీనమైపోయి న్యాయం చేశాడు. సామాజిక అంశాలు మేళవించిన సందేశాత్మక చిత్రమిది. మదర్‌సెంటిమెంట్ నేపథ్యంలో సాగే రాజకీయ చిత్రమిది అన్నారు. ఈ సినిమా కోసం మనీష్ చాలా కష్టపడ్డాడు. చిన్న చిత్రంగా మొదలుపెట్టిన ఈ కథ డిమాండ్‌ను బట్టి బడ్జెట్ ఐదురేట్లు పెరిగింది. సత్యారెడ్డి నా మీద నమ్మకంతో తన కొడుకుని నా చేతిలో పెట్టారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సినిమాను తీర్చిదిద్దాను. కథానుగుణంగా వెంగి అద్భుతమైన పాటలిచ్చారు అని దర్శకుడు చెప్పారు. సామాజిక బాధ్యత మేళవించిన ఇతివృత్తం ద్వారా కథానాయకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని మనీష్‌బాబు పేర్కొన్నాడు.

521

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles