ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్


Sun,August 25, 2019 12:42 AM

praoduction no 2 launch from light house cine magic

శివ కంఠమనేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. లైట్‌హౌస్ సినీ మేజిక్ సంస్థ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. నందితాశ్వేత కథా నాయిక. రాశీ, అశోక్‌కుమార్, శ్రీనివాస రెడ్డి ప్రధాన తారాగణం. జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కె.ఎస్.శంకరరావు, వి.కృష్ణారావు నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి అశోక్‌కుమార్ క్లాప్‌నివ్వగా, విజయ్‌కుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు చంద్రసిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ కన్నడంలో ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతంతో కాదు..ఆలోచిస్తూ, ఆవేశంతో సమస్యలను ఎదుర్కొవాలనే పాత్రలో హీరో కనిపిస్తారు. శాంతం, ఆవేశం అన్ని కలిస్తేనే జీవితం అనే దృక్పథంతో కథానాయిక పాత్ర చిత్రణ ఉంటుంది. ప్రతి పాత్ర వైవిధ్యంగా సాగుతుంది అని తెలిపారు. కుటుంబమంతా చూసే చిత్రమిది.

మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్ వైజాగ్‌లో చేస్తాం. మొత్తం ఐదు పాటలుంటాయి అని నిర్మాత చెప్పారు. హీరో మాట్లాడుతూ కుటుంబ అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. వినూత్న ఇతివృత్తంతో తెరకెక్కించబోతున్నాం అన్నారు. సినిమాలో స్వతంత్ర భావాలు కలిగిన మహిళ పాత్రను పోషిస్తున్నానని, చాలా విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడం ఆనందంగా ఉందని రాశి చెప్పారు. కె.అశోక్‌కుమార్, అజయ్, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, బిత్తిరి సత్తి, అజయ్ ఘోష్, ఆదిత్యామీనన్, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హరీష్, మాటలు: అంజన్, సంగీతం: యశస్వినీ గున్ను, సుధాకర్ మారియో, ఎడిటింగ్: ఆవుల వెంకటేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్ మేగోటి.

252

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles