ఆంక్షలు తొలగిపోవాలి!


Sat,May 18, 2019 11:46 PM

Pranitha Is Not Having any important in Brahmotsavam

మహిళలపై సామాజికపరమైన ఆంక్షలు తొలగిపోయినప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని చెబుతున్నది కన్నడ కస్తూరి ప్రణీత. గతకొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఈ సొగసరి ప్రస్తుతం బెంగళూరులో వ్యాపారవేత్తగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు పాఠశాలల దత్తత వంటి కార్యక్రమాలతో సేవాగుణాన్ని చాటుతున్నది. ఈ అమ్మడు ఈ మధ్యే బెంగళూరులో హైఎండ్ బార్‌ను మొదలుపెట్టిందట. తన సన్నిహితులతో కలిసి ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టానని, మహిళలకు పరిచయంలేని ఈ రంగంలో సక్సెస్ అవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని చెప్పింది. తొలుత బార్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నానని చెప్పగానే చాలా మంది విస్మయం వ్యక్తం చేశారు.

మహిళలకు కలిసొచ్చే వ్యాపారం కాదని హెచ్చరించారు. అయితే నా మిత్రుల అండతో ధైర్యంగా అడుగుపెట్టాను. ప్రస్తుతం ఆశించిన ఫలితాలే వస్తున్నాయి అని చెప్పింది ప్రణీత. ఉన్నత విద్యావంతుల కుటుంబలో పుట్టిన తనకు చదువు విలువ బాగా తెలుసునని, గ్రామాల్లోని పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్ధేశ్యంతో హసన్ జిల్లా (కర్ణాటక)లో ఓ ప్రభుత్వ స్కూల్‌ను దత్తత తీసుకున్నానని చెప్పింది. ఇటీవల ఎన్నికల్లో ఎలక్షన్ కమీషన్ తరపున అంబాసిడర్‌గా ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించడానికి కృషి చేశానని ఆమె పేర్కొంది. వ్యాపారంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం గొప్ప సంతృప్తినిస్తున్నదని చెప్పింది ప్రణీత.

1052

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles