చిరంజీవి టైటిల్‌తో..


Wed,January 9, 2019 11:33 PM

Pranam Khareedu movie teaser launched

ప్రశాంత్, అవంతిక జంటగా నటిస్తున్న చిత్రం ప్రాణంఖరీదు. పి.ఎల్.కె. రెడ్డి దర్శకుడు. నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. నందమూరి తారకరత్న కీలక పాత్రను పోషిస్తున్నారు. సెన్సార్ పూర్తయింది. యు.ఏ సర్టిఫికెట్ లభించింది. దర్శకుడు మాట్లాడుతూ క్రిమినల్‌కు, పోలీస్ ఆఫీసర్‌కు మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం అని తెలిపారు. హీరో మాట్లాడుతూ చిరంజీవి నటించిన తొలి సినిమా ప్రాణం ఖరీదు లాంటి పవర్‌ఫుల్ టైటిల్‌తో హీరోగా పరిచయం కానుండటం ఆనందంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠను ప్రతి క్షణం పంచుతుంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం అన్నారు.

1872

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles