సస్పెన్స్ థ్రిల్లర్ ప్రాణం ఖరీదు


Sat,March 9, 2019 11:54 PM

pranam khareedu audio launch

తారకరత్న ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ప్రాణంఖరీదు. ప్రశాంత్, అవంతిక జంటగా నటించారు. పి.యల్.రెడ్డి దర్శకుడు. నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాత. త్వరలో విడుదలకానుంది. వందేమాతరం స్వరపరచిన ఈ చిత్ర గీతాల్ని నిర్మాత కె.యల్.దామోదరప్రసాద్ శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. నేర పరిశోధన నేపథ్యంలో కథ సాగుతుంది. తారకరత్న పాత్ర కథలో కీలకంగా ఉంటుంది అన్నారు. యాక్షన్‌తో పాటు భావోద్వేగభరితంగా సాగే కథాంశమిది. హీరో ప్రశాంత్ మంచి నటన కనబరిచాడు. టైటిల్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. కథానుగుణంగా పాటలు కుదిరాయి అని దర్శకుడు తెలిపారు. వినూత్న కథా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని నాయకానాయికలు తెలిపారు.

377

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles