సెలబ్రిటీ అవార్డ్స్


Sat,July 6, 2019 12:57 AM

Praja Dairy Film Awards Press Meet Jeevitha Rajasekhar Suman Actress Hema Konijeti Rosaiah

ప్రజాడైరీ 19వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఫిలిం సెలెబ్రిటీ ఆవార్డ్స్ కార్యక్రమాన్ని ఆ సంస్థ అధినేత సురేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పలువురికి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ సురేష్ గత 19 ఏళ్లుగా తెలుసు. నాకు మంచి మిత్రుడు కూడా. ఆయన పట్టుదల నాకు నచ్చుతుంది. రోశయ్యతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందాన్ని కలిగించింది. ప్రజాడైరీ తరపున సురేష్ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో సురేష్ ఎప్పుడూ ముందుంటారని, ఆయన నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ తాను పాల్గొంటున్నానని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్, జీవిత, హేమ, గురురాజ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

676

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles