హారర్ థ్రిల్లర్ అభినేత్రి-2


Sun,May 26, 2019 11:29 PM

prabhu deva tamannaahs abhinetri-2 teaser realesed

ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం అభినేత్రి-2. ఏ.ఎల్. విజయ్ దర్శకుడు. ఈ నెల 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. అభిషేక్ నామా, ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతున్నది. వినోదం మేళవించిన హారర్ థ్రిల్లర్‌గా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. నాయకానాయికలు ఎందుకు దయ్యాలుగా మారారనే అంశం ఆసక్తికరంగా అనిపిస్తుంది అన్నారు. నందితాశ్వేత, సప్తగిరి, సోనూసూద్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆయంకబోస్, సంగీతం: శామ్ సి.ఎస్.

1351

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles