హైదరాబాద్ యువకుడి కథ


Tue,April 23, 2019 11:53 PM

prabhas unveils nuvvu thopura trailer

సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం నువ్వు తోపురా. హరినాథ్‌బాబు. బి దర్శకుడు. డి.శ్రీకాంత్ నిర్మాత. మే 3న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ర్టాల్లో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో అగ్రహీరో ప్రభాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. కథాంశం అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా సుధాకర్ కోమాకుల మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అన్నారు. ట్రైలర్‌ను విడుదల చేసి మా చిత్ర యూనిట్‌ను అభినందించిన ప్రభాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.

సూరి అనే హైదరాబాద్ యువకుడికి సంబంధించిన కథ ఇది. ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరిగే హీరో ఎలా జీవితంలో వృద్ధిలోకి వచ్చాడు? అమెరికా ఎందుకు వెళ్లాల్సివచ్చిందన్నది కథలో ఆసక్తికరంగా ఉంటుంది. అందరికి స్ఫూర్తినిచ్చే కథ ఇది అన్నారు. నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యారెడ్డి, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రకాష్ వేలాయుధమ్, కథ, మాటలు: అజ్జు మహంకాళి, సంగీతం: సురేష్ బొబ్బిలి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరినాథ్ బాబు బి.

2026

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles