హృదయాల్ని ఏలే జాన్‌

Wed,October 23, 2019 12:57 AM

ప్రభాస్‌ విగ్రహంలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఉన్నతంగా కనిపిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నానుడి ఆయన నడవడికలో ప్రతిఫలిస్తుంది. అందుకే అభిమానుల్ని ఆయన్ని డార్లింగ్‌ అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. ‘బాహుబలి’ సిరీస్‌ సినిమాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ప్రాచుర్యం సంపాదించుకున్నారు ప్రభాస్‌. ఆ విజయం ఆయనకు ఓ అలంకారంగా భాసిల్లింది తప్ప ఇసుమంత అహంకారాన్ని తెచ్చిపెట్టలేదు. నేడు ప్రభాస్‌ జన్మదినం. ప్రస్తుతం ఆయన గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘జాన్‌' అనే పేరు ప్రచారంలో ఉంది. కేకే రాధాకృష్ణ దర్శకుడు. పూజాహెగ్డే కథానాయిక. త్వరలో హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌కు ప్లాన్‌ చేశారు. దీనికోసం భారీ సెట్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ముఖ్యతారాగణమంతా పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌పరమహంస, ఎడిటర్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సంగీతం: అమిత్‌త్రివేది, సమర్పణ: గోపీకృష్ణమూవీస్‌ కృష్ణంరాజు. దర్శకత్వం: కేకే రాధాకృష్ణకుమార్‌.

802

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles