కెజీఎఫ్ దర్శకుడితో..


Thu,January 3, 2019 01:47 AM

Prabhas Going To Make A Movie With KGF Director

బాహుబలి సినిమాకు నాలుగేళ్లు కేటాయించి ఆ సమయంలో మరో చిత్రంలో నటించని ప్రభాస్ ఆ సినిమా తరువాత వరుస చిత్రాల్ని అంగీకరిస్తూ స్పీడు పెంచారు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సాహోచిత్రంలో నటిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో హీరో ప్రభాస్ పరిచయానికి సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ రాధాకృష్ణకుమార్‌తో ఓ సినిమా చేస్తున్నారు. దీనితో పాటు ఆయన మరో చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. కన్నడ స్టార్ యష్ హీరోగా కెజీఎఫ్ చిత్రాన్ని రూపొందించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వుందని తాజా సమాచారం. ద్విభాషా చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి నిర్మించే అవకాశం వుందని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని చిత్ర బృందం త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.

2302

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles