పూజా తీన్‌మార్..!


Tue,March 13, 2018 01:04 AM

Prabhas Fixed Pooja Hegde As Heroine For Sahoo Movie Finally

poojahegde.jpg
అదృష్టమంటే పూజా హెగ్డేదే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఈ కన్నడ కస్తూరి పట్టిందల్లా బంగారమే అవుతున్నది. ఆమెకు భారీ చిత్రాల్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్‌బాబు కథానాయకుడిగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా ఖరారైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రంలో కూడా ఈ అమ్మడే కథానాయిక. తాజాగా ఈ సొగసరి ప్రభాస్‌తో జోడీ కట్టబోతుంది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే వెల్లడించింది. ప్రస్తుతం సాహోలో నటిస్తున్న ప్రభాస్..ఈ సినిమా అనంతరం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో స్వీయనిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ పతాకంపై ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది.

త్వరలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభంకానున్నట్లు సమాచారం. ముకుంద చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన పూజాహెగ్డే ఆ తర్వాత బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. గత ఏడాది దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సాక్ష్యం చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. రామ్‌చరణ్ రంగస్థలంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. తాజాగా అగ్ర హీరోల సరసన మూడు భారీ సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకొని తారాపథంలో దూసుకెళ్లడానికి సిద్ధమవుతున్నది.

1686

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles