చంద్రబాబుకు విలువలు లేవు


Tue,March 19, 2019 12:00 AM

Posani Krishna Murali targets Chandrababu Press Meet

ఏ రాజకీయ నాయకుల్ని, పార్టీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రిగారు మీరు మాటిచ్చారు సినిమా చేయలేదని, ఇందులో ఎవరి పాత్రలు, గెటప్‌లు కనిపించవని అన్నారు పోసాని కృష్ణమురళి. తన సినిమా చూడకుండా, యథార్థాలు తెలుసుకోకుండా ఏపీ ఎన్నికల కమీషన్ సినిమా మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ఆరోపించారాయన. సోమవారం హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగారు మీరు మాటిచ్చారు సినిమా చేస్తున్నాను. దేశానికి, ప్రజాస్వామ్యానికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో రూపొందిస్తున్న చి త్రమిది. అయితే ఈ సినిమాలో

చంద్రబాబును అవమానపరిచినట్లు, ఆయన్ని కించపరచడానికే సినిమా తీస్తున్నానని చిత్తూరుకు చెందిన మోహన్‌రావు అనే టీడీపీ కార్యకర్త తమకు ఫిర్యాదుచేశాడని ఎన్నికల కమీషన్ నాకు ఉత్తరం రాసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీస్తున్నానని నా సినిమాను ఆపాలని ఫిర్యాదులో పేర్కొన్నాడని కమీషన్ తెలిపింది. ఓ ముఖ్యమంత్రికి, సామాజిక కార్యకర్తకు, రైతుకు మధ్య జరిగే కథ ఇది. చంద్రబాబును కించపరచడానికి సినిమా తీస్తున్నానని నేను ఎక్కడా చెప్పలేదు. అయినా యథార్థాలు తెలుసుకోకుండా ఎవరో తెలుగుదేశం కార్యకర్త చేసిన ఫిర్యాదు స్వీకరించి నన్ను ప్రశ్నించడం న్యాయమేనా అని ఎన్నికల కమీషన్‌ను అడుగుతున్నాను. సందేశాత్మక చిత్రమిదని ఎన్నికల కమీషన్ వారికి స్వయంగా ఉత్తరం ద్వారా బదులిచ్చాను. నా సినిమా కథేమిటో చెబుతూ అన్ని అనుమానాల్ని నివృత్తి చేస్తూ మూడు పేజీల ఉత్తరం రాసినా కూడా వచ్చి కలవమని ఎన్నికల కమీషన్‌వారు అంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నానని నన్ను పిలుస్తున్నారా? నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారా? అని కమీషన్‌ను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు గురించి ప్రజలందరికి తెలుసు. ఆయన్ని తిట్టడానికి బుద్ధి ఉన్నవాడెవడైనా కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తాడా? చంద్రబాబు దొంగ, ఎన్టీఆర్‌ను చంపింది ఆయనే. ఓటుకు నోటు కేసులో డబ్బులు ఇచ్చి దొరికాడు. చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నాయకులు నిమ్నకులాలవారిని అసభ్యంగా దూషించారు. చంద్రబాబు చేసిన వెధవ పనులన్నీ ప్రజలకు తెలుసు. ఆయన కోసం తీసిన సినిమా అని నిరూపిస్తే నా చిత్రాన్ని ఆపేస్తాను. ఎన్నికల్లో చంద్రబాబు దొంగపనులు చేశాడని నేను ఫిర్యాదు చేస్తే ఆయన్ని అలాగే పిలిపిస్తారా? ముఖ్యమంత్రికి ఒక నీతి, సాధారణ పౌరుడినైనా నాకు ఓ నీతి ఉంటుందా? అని అడుగుతున్నాను. చంద్రబాబు ఓ దొంగ, అవినీతిపరుడు, విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. ఆయనకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది అని తెలిపారు.

1839

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles