సువర్ణసుందరి చరిత్ర

Thu,February 7, 2019 12:32 AM

సువర్ణ సుందరి ప్రచార చిత్రం బాగుంది. చక్కటి కథాంశానికి గ్రాఫిక్స్ హంగులను జోడించి అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు అని అన్నారు దర్శకుడు బి.గోపాల్. జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సువర్ణసుందరి. ఎం.ఎస్.ఎన్ సూర్య దర్శకుడు. ఎమ్.ఎల్ లక్ష్మి నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకుడు బి.గోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ చారిత్రక కథాంశంతో ముడిపడిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ చిత్రమిది. సువర్ణ సుందరి ఎవరు? ఆమె చరిత్ర కొందరి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేసిందన్నది ఆకట్టుకుంటుంది. గ్రాఫిక్స్ కోసం ఏడాది పాటు శ్రమించాం. ఆలస్యమైనా ప్రేక్షకుల్ని ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. వినూత్నమైన కథ, కథనాలతో రూపుదిద్దుకున్న చిత్రమిది. సినిమాలో నాపై చిత్రీకరించిన పోరాట ఘట్టాలు అలరిస్తాయి అని సాక్షిచౌదరి చెప్పింది. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ కథాబలమున్న ఇలాంటి మంచి సినిమాల వల్ల ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతారు. వైవిధ్యమైన ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం మెప్పిస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాగర్, రామ్, ఇంద్ర, రామ్ సుంకర, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

1008

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles