పింక్ రీమేక్‌లో..?

Wed,November 6, 2019 12:11 AM

తెలుగు చిత్రసీమ అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతోంది మంగళూరు సోయగం పూజాహెగ్డే. పలు భారీ సినిమాల్లో నాయికగా ఈ అమ్మడి పేరే ప్రముఖంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం ఈ సుందరి అల వైకుంఠపురములో జాన్ చిత్రాల్లో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం పూజాహెగ్డే పింక్ తెలుగులో రీమేక్‌లో నటించే అవకాశం సొంతం చేసుకున్నట్లు తెలిసింది. బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్ (2016) చిత్రాన్ని తెలుగులో పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో పునర్నిర్మించబోతున్నారు. హిందీ చిత్రంలో తాప్సీ పోషించిన పాత్రను తెలుగులో పూజాహెగ్డే చేయబోతున్నదని సమాచారం. తెలుగు వెర్షన్‌ను దిల్‌రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తారు. తెలుగు రీమేక్‌లో నాయికగా పూజాహెగ్డేను నటింపజేసేందుకు బోనీకపూర్ ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం సంప్రదింపులు ముగిశాయని, ఈ సినిమాలో నటించేందుకు పూజాహెగ్డే సుముఖంగా ఉందని సమాచారం. పింక్ చిత్రం తాప్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. బాలీవుడ్ కెరీర్‌కు టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది. భిన్న భావోద్వేగాల సమాహారంగా సవాలుతో కూడిన ఆ పాత్ర ఇప్పుడు పూజాహెగ్డేను వరించడం విశేషం.

606

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles