తేడాలెందుకు?


Fri,March 22, 2019 11:27 PM

Pooja Hegde Demanded high Remuneration for Maharshi

చిత్రసీమలో నటన, కష్టపడేతత్వం, సృజనతో పాటు అన్ని విషయాల్లో హీరోలతో సమానంగా కథానాయికలు రాణిస్తున్నారని అంటోది పూజా హెగ్డే. అయితే పారితోషికం విషయంలో మాత్రం ఈ సమానత్వం కనిపించడం లేదని చెబుతున్నది. మహిళా ప్రధాన ఇతివృత్తాలతో తెరకెక్కుతున్న చిత్రాలు వందల కోట్ల వసూళ్లను సాధిస్తున్నా అందులో నటించే హీరోయిన్లకు మాత్రం పారితోషికాలు తక్కువే చెల్లిస్తున్నారని చెబుతున్నది. ఇండస్ట్రీలోని అసమానతలపై పూజా హెగ్డే మాట్లాడుతూ విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ నవతరం కథానాయికలంతా ప్రతిభను చాటుకుంటున్నారు. స్టార్ హీరోలతో సమానంగా వారి చిత్రాలు మంచి వసూళ్లను సాధిస్తున్నాయి.

అయినా పారితోషికం, పేరుప్రఖ్యాతుల విషయంలో చాలా ఏళ్లుగా హీరోయిన్ల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. సినిమా కోసం నాయకానాయికలు పడే శ్రమలో తేడాలేనప్పుడు పారితోషికంలో మాత్రం భేదాలు ఎందుకు ఉండాలి?. కేవలం హీరోల వల్లే సినిమాలు ఆడుతున్నాయని ఆలోచించే నిర్మాతల ధోరణిలో మార్పులు రావాలి. హీరోయిన్ల కష్టానికి విలువనివ్వాలి. ఈ అసమానతలను రూపుమాపడానికి కథానాయికలంతా ఐకమత్యంతో కృషిచేయాలి అని తెలిపింది. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో మహేష్‌బాబుతో మహర్షి సినిమాలో నటిస్తున్నది.

1273

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles