అఖిల్‌తో ఆటపాట


Thu,September 5, 2019 11:48 PM

Pooja Hegde Confirmed For Akhil Akkineni Bommarillu Bhaskar Film

తెలుగు చిత్రసీమలో కన్నడ కస్తూరి పూజాహెగ్డే హవా నడుస్తున్నది. పలు భారీ చిత్రాల్లో కథానాయికగా ఈ సుందరి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. రంగస్థలం సినిమాలో జిగేలురాణిగా కుర్రకారు హృదయాల్ని హుషారెత్తించిన ఈ అమ్మడు అక్కడి నుంచి వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. ఇటీవలే మహర్షి సినిమాలో మహేష్‌బాబు సరసన తళుక్కున మెరిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ వయ్యారి అక్కినేని అఖిల్ సరసన నటించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. బన్నివాసు నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డే ఖరారైంది. ఒకలైలా కోసం చిత్రంలో నాగచైతన్యతో జత కట్టిన ఈ పొడుగుకాళ్ల సొగసరి తాజాగా ఆయన సోదరుడితో ఆడిపాడబోతుండటం విశేషం. ఇదిలావుండగా ఒంగోలు గిత్త తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తెలుగులో ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నిర్ధేశకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఫీల్‌గుడ్‌రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో ఇల వైకుంఠపురములో వాల్మీకి చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.

937

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles