రాజకీయ వ్యంగ్యాస్త్రం


Sun,August 25, 2019 11:30 PM

Political Satire Johar Movie Pre look Released

నైనా గంగూలీ, ఈస్తర్ అనిల్, ఈశ్వరీరావు, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జోహార్. భానుసందీప్ నిర్మాత. తేజ మార్ని దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రీలుక్‌ను ఆదివారం విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ వంగవీటి చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ వద్ద దర్శకత్వశాఖలో, రచయిత విజయేంద్రప్రసాద్ వద్ద రచనా విభాగంలో పనిచేశాను. రాజకీయ వ్యంగ్యాస్త్రంగా తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా కథ ఇది. ఐదు పాత్రల నేపథ్యంలో నాలుగు కథల సమాహారంగా ఉంటుంది. వారణాసి, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్‌లలో చిత్రీకరించాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం అని చెప్పారు. శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ, అంకిత్ కొయ్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: ప్రియదర్శన్.

362

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles