ప్లాన్ చేసిందెవరు?


Tue,April 16, 2019 12:11 AM

Planning Telugu Movie Theatrical Trailer

మహేంద్ర, మమత కులకర్ణి జంటగా నటిస్తున్న చిత్రం ప్లానింగ్. సాయిగణేష్ మూవీస్ పతాకంపై టి.వి. రంగసాయి నిర్మిస్తున్నారు. బి.ఎల్. ప్రసాద్ దర్శకుడు. ఉదయ్‌కిరణ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. నిర్మాత సి. కల్యాణ్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పాటలు, విజువల్స్ బాగున్నాయి. ప్రస్తుతం చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడాలు లేకుండా కథల్ని నమ్మి మంచి చిత్రాల్ని తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం అలరించాలి అని తెలిపారు.

రొటీన్‌కు భిన్నమైన ప్రేమకథా చిత్రమిదని, దర్శకనిర్మాతలు ఎంతో ప్లానింగ్‌తో ఈ సినిమా చేశారని హీరో చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ప్రేమ, వినోదం, రొమాన్స్, సందేశం మిళితమైన చిత్రమిది. యువతరం మనోభావాలకు దర్పణంగా ఉంటుంది. ఓ భవంతిలో కొందరు యువతీయువకులకు ఎదురైన అనూహ్య పరిణామాలేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది. కథకు తగ్గ సంగీతం కుదిరింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాయివెంకట్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

1013

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles