ప్లాన్ చేసిందెవరు?

Tue,October 22, 2019 12:06 AM

మహేంద్ర, మమతా కులకర్ణి, అస్మిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ప్లానింగ్. సాయిగణేష్ మూవీస్ పతాకంపై టి.వి. రంగసాయి నిర్మించారు. బి.ఎల్. ప్రసాద్ దర్శకుడు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ఓ ప్లాన్ కొందరి జీవితాల్ని ఎలాంటి మలుపులు తిప్పిందన్నది ఆకట్టుకుంటుంది. రొమాన్స్, ప్రేమ, సెంటిమెంట్‌తో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం మిళితమైన చిత్రమిది అని అన్నారు. మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ చక్కటి ప్లానింగ్‌తో దర్శకనిర్మాతలు ఈ సినిమాను రూపొందించారు. నటీనటుల అభినయం, సంగీతం, ఛాయాగ్రహణం అన్ని బాగున్నాయి అని పేర్కొన్నారు.


నిర్మాత మాట్లాడుతూ సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. దర్శకుడు ప్రసాద్ అనుభవజ్ఞుడిలా చక్కటి అవగాహనతో ఈ సినిమాను రూపొందించారు. ఉదయ్‌కిరణ్ స్వరపరచిన బాణీలకు చక్కటి స్పందన లభిస్తున్నది. సెన్సార్ పూర్తయింది. యు.ఎ సర్టిఫికెట్ లభించింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయ్‌కుమార్, అస్మిత, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

661

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles