ఆర్‌డిఎక్స్ ప్రేమకథ!


Sun,August 4, 2019 12:11 AM

Payal Rajput RDX Love Movie First Look Launch By Venkatesh

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్‌డిఎక్స్ లవ్. శంకర్ భాను దర్శకుడు. జి. రామ్ మునీష్ సమర్పణలో హ్యాపీ మూవీస్, సీకే సినిమాస్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని శనివారం హీరో వెంకటేష్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఫస్ట్‌లుక్ ఆసక్తికరంగా వుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. ఓ విభిన్నమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Payal-Rajput
రధన్ సంగీతం, సి.రామ్‌ప్రసాద్ ఫొటోగ్రఫీ, పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. నరేష్, ఆమని, ముమైత్‌ఖాన్, విద్యుల్లేఖారామన్, నాగినీడు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: సి. రామ్‌ప్రసాద్, మాటలు: పరశురామ్, ఫైట్స్: నందు, డ్యాన్స్: గణేష్ స్వామి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌భాను.

356

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles