Telangana Intermediate 1st & 2nd Year Results 2019

వినోదాల వెంట పరుగు


Mon,March 18, 2019 11:57 PM

parari movie first look launched

చిత్ర నిర్మాత గిరి నా అభిమాని. పట్టుదలతో మంచి కథను ఎన్నుకొని తన కొడుకును ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశాడు. వినూత్న కథా, కథనాలతో సాగే వినోదభరిత చిత్రమిది అని అన్నారు సీనియర్ నటుడు సుమన్. యోగేశ్వర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం పరారి. రన్ ఫర్ ఫన్ ఉపశీర్షిక. శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి వి.వి.గిరి నిర్మిస్తున్నారు. సాయి శివాజీ దర్శకుడు. సుమన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్మాత సి.కల్యాణ్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరోగా యోగేశ్వర్‌కు ఇదే తొలి సినిమా అయినా ఎంతో పరిణితితో నటించాడు. తన పాత్రలో లీనమయ్యాడు. డాన్స్‌మాస్టర్ అయిన శివాజీ ఈ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుతెచ్చుకోవాలి అని తెలిపారు.

దర్శకుడు శివాజీ ఈ చిత్రాన్ని రమణీయంగా తీర్చిదిద్దారని, చక్రి సోదరుడు మహిత్‌నారాయణ్ బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సుమన్ అన్నారు. ఒక పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో షూటింగ్ చేశాం అని నిర్మాత పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ నవ్విస్తూనే థ్రిల్‌ను పంచే సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులు కోరుకునే అన్ని హంగులు ఉన్నాయి అన్నారు. తొలి సినిమాతోనే నటుడిగా చాలా నేర్చుకునే అవకాశం దొరికిందని హీరో యోగేశ్వర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, మహిత్‌నారాయణ్, గౌతమ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

644

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles