త్రీడీ పరమానందయ్య శిష్యులు

Tue,October 22, 2019 12:05 AM

మనందరికి తెలిసిన పరమానందయ్య శిష్యుల కథను ఇప్పుడున్న ఆధునిక సాంకేతికతను వాడుకొని కొత్తగా చూపించే ప్రయత్నం చేయడం అభినందనీయం అని అన్నారు దర్శకుడు మారుతి. పింక్‌రోజ్ సినిమాస్ పతాకంపై వెంకట రాజేష్‌పులి దర్శకత్వంలో రూపొందిన చిత్రం పరమానందయ్య శిష్యుల కథ త్రీడీ. సంతన్‌రెడ్డి, సి.హెచ్.కిరణ్‌శర్మ నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు మారుతి విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారులకు నచ్చేలా త్రీడీహంగులతో రూపొందించిన చిత్రమిది అని తెలిపారు. పరమానందయ్య శిష్యుల కథలో ఉండే నీతిని పిల్లలకు ఉద్భోదించాలనే సంకల్పంతో త్రీడీలో ఈ సినిమాను నిర్మించాం. చిన్నారులతో పాటు అన్ని వర్గాలను అలరించేలా ఉంటుంది అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఛాయాగ్రహణం: జి.ప్రభాకర్‌రెడ్డి.

412

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles