పప్పు లాంటి అబ్బాయి

Mon,November 11, 2019 12:10 AM

టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ నెల 29న ఈ చిత్రం విడుదలకానుంది. ఆదివారం చిత్రబృందం పప్పు లాంటి అబ్బాయి అనే పాటను విడుదలచేసింది. తండ్రీకొడుకుల ప్రేమకు నిదర్శనంగా ఈ పాట నిలుస్తుందని రామ్‌గోపాల్‌వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ రౌడీయిజం, రాజకీయం, ఫ్యాక్షనిజం అంశాల సమ్మిళితంగా సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో ఏడు పాటలుంటాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో పాటు పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నిర్మాతలు: టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్, సహనిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ.


2940

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles