పండుగాడి హంగామా!


Wed,June 5, 2019 12:05 AM

Pandu Gadi Photo Studio  We are planning to release this month

అలీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పండుగాడి ఫొటోస్టూడియో. దిలీప్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. రిషిత కథానాయిక. పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండ వెంకట సాంబిరెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ అలీ ఇందులో ఓ ఫొటోస్టూడియో నడిపించే యువకుడిగా నటించారు. ఆయన ఫొటో తీస్తే వారికి పళ్లైపోతుంది. అలాంటి పండుగాడి చుట్టూ ఏం జరిగింది? ఈ క్రమంలో పండుగాడు చేసిన హంగామా ఎలా నవ్వులు పూయించింది? అన్నది తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే. సినిమాలోని పాత్రల పేర్లన్నీ కొత్తగా వుంటాయి. ఆ పాత్రలతో ఆలీ పండించే హస్యం అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. వినోద్‌కుమార్, బాబూమోహన్, సుధ తదితరులు నటిస్తున్నారు.

708

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles