1978లో ఏం జరిగింది?


Sat,January 5, 2019 11:22 PM

palasa 1978 movie launch feb 9

రక్షిత్ కథానాయకుడిగా నటించనున్న చిత్రం పలాస 1978. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ నిర్మించనున్నారు. కరుణ కుమార్ దర్శకుడు. నక్షత్ర కథానాయికగా పరిచయమవుతున్నది. ఫిబ్రవరి 9న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. దర్శకుడు మాట్లాడుతూ యథార్థ ఘటనల ఆధారంగా రూపొందనున్న చిత్రమిది. ప్రేమ, వినోదం, భావోద్వేగాలు, సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ 1978లో పలాసలో ఓ ప్రేమజంటకు ఎదురైన పరిణామాలేమిటన్నది ఈ చిత్ర ఇతివృత్తం. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందిస్తున్నాం. లండన్‌బాబులు ఫేమ్ రక్షిత్ హీరోగా నటిస్తున్నారు. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరణ జరుపుతాం అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె, సాహిత్యం: భాస్కరభట్ల, లక్ష్మీభూపాల్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

2288

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles