లక్ష్యం కోసం పోరాటం


Thu,August 22, 2019 11:45 PM

Pailwaan Movie Official Trailer Release

సుదీప్ కథానాయకుడిగా నటిస్తున్న కన్నడ చిత్రం పహిల్వాన్. ఎన్.కృష్ణ దర్శకుడు. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం సంస్థ అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. సెప్టెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి, ఆకాంక్షసింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే చిరంజీవి విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో సుదీప్ రెజ్లర్ పాత్రలో కనిపిస్తారు. పవర్‌ఫుల్ యాక్షన్ అంశాలతో పాటు భావోద్వేగప్రధానంగా కథ నడుస్తుంది. లక్ష్యాన్ని సాధించడానికి ఓ రెజ్లర్ సాగించిన పోరాటమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: కరుణాకర్, స్క్రీన్‌ప్లే: కృష్ణ, మధు, కన్నన్, సంభాషణలు: హనుమాన్‌చౌదరి, సంగీతం: అర్జున్ జన్యా, రచన-దర్శకత్వం: ఎస్.కృష్ణ.

448

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles