మనసు చేసే మాయ!


Tue,December 11, 2018 01:04 AM

Padi Padi Leche Manasu  is releasing on December 21st

మనసు మనసు కలిస్తే ఆ మైమరపును మాటల్లో వర్ణించలేము. హృదయంలోని ప్రణయభావనల మధురిమల్ని ఆస్వాదించి తీరాల్సిందే. అలాంటి అందమైన ప్రేమానుభూతులకు దృశ్యరూపమే పడి పడి లేచె మనసు అంటున్నారు హను రాఘువపూడి. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 21న ప్రేక్షకులముందుకురానుంది. ఈ నెల 14న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ప్రేమ ప్రయాణంలోని అందమైన జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చే చిత్రమిది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. శర్వానంద్, సాయిపల్లవి మధ్య చక్కటి కెమిస్ట్రీ కుదిరింది అన్నారు. మురళీశర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి, ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్, సంగీతం: విశాల్‌చంద్రశేఖర్.

2064

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles