గ్రామీణ ప్రేమకథ


Sat,July 6, 2019 12:52 AM

our auri love story in august

మంజునాథ్ హీరోగా నటిస్తూ రూపొందిస్తున్న చిత్రం మా ఊరి ప్రేమకథ. శ్రీలక్ష్మీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ పతాకంపై లక్ష్మీదేవి, మహేంద్రనాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తనిష్క తివారి కథనాయిక. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మంజునాథ్ హీరోగా నటిస్తూ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కొత్త పంథాలో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సెన్సార్ పూర్తి చేసి చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. యథార్థ సంఘటల నేపథ్యంలో సహజత్వానికి దగ్గరగా రూపొందిన చిత్రమిది. జయసూర్య సంగీతం ఆకట్టుకుంటుంది అని దర్శకుడు తెలిపారు.

795

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles