నవీన్‌లో మంచి ఈజ్ వుంది!


Thu,January 17, 2019 12:24 AM

Oorantha Anukuntunnaru Movie Teaser Launch by Krishna and Vijaya Nirmala

నవీన్ విజయకృష్ణ, శ్రీనివాస్ అవసరాల కథానాయకులుగా నటిస్తున్న చిత్రానికి ఊరంతా అనుకుంటున్నారు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బాలాజీ సానల దర్శకుడు. మేఘా చౌదరి, సోఫియాసింగ్ కథానాయికలు. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. బుధవారం హీరో నవీన్ విజయకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర టైటిల్ లోగోను, ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నటులు కృష్ణ, విజయనిర్మల విడుదల చేశారు. కృష్ణ మట్లాడుతూ టైటిల్ బాగుంటే సగం సినిమా హిట్టయినట్టే. ఈ సినిమాకు ఊరంతా అనుకుంటున్నారు అనే నేటివ్ టైటిల్ దొరికింది. ఇంగ్లీష్ పదాలతో ఎక్కువ టైటిల్స్ వస్తున్న ఈ తరుణంలో ఇలాంటి టైటిల్‌తో రావడం బాగుంది. చిన్నతనం నుంచి నవీన్ సినీ వాతావరణంలో పెరిగాడు. తనలో మంచి ఈజ్ వుంది. పాటలు, ఫైట్‌లు అన్నీ బాగా చేయగలుగుతున్నాడు. నటుడిగా అతనికి మంచి భవిష్యత్తు వుంటుంది. నరేష్ జడ్జిమెంట్ బాగుంటుంది. తను కథ విన్నానని, బావుందని చెబుతున్నాడు అంటే సినిమాలో విషయం వున్నట్టే. నవీన్‌కు ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలి అన్నారు.

1831

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles