ఊరంతా ఏమనుకుంటున్నారు?


Mon,April 8, 2019 12:04 AM

Oorantha Anukuntunnaru Movie Teaser launch

నవీన్ విజయకృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియాసింగ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ఊరంతా అనుకుంటున్నారు. బాలాజీ సానల దర్శకుడు. శ్రీహరి, రమ్య, పి.ఎల్.ఎన్.రెడ్డి, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో యువహీరో సాయితేజ్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విడుదల చేశారు. ఈ సందరర్భంగా సాయితేజ్ మాట్లాడుతూ నవీన్ విజయకృష్ణ నాకు అత్యంత సన్నిహితుడు. నా ప్రతి మలుపులో అండగా నిలబడ్డాడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. రెండు జంటల కథ ఇది. వారి ప్రేమాయణం గురించి ఊరిలోని వారు ఏమనుకున్నారు? అందరి ఆమోదంతో ఆ జంటలు ఎలా ఒక్కటయ్యాయన్నదే చిత్ర ఇతివృత్తం.

కుటుంబ విలువలు, ఊరిలోని ఆప్యాయత, అనురాగాలకు కలబోతగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని దర్శకుడు చెప్పారు. కుటుంబ బంధాలకు దర్పణంలా నిలిచే చిత్రమిదని, కోనసీమ అందాలు కనువిందు చేస్తాయని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ప్రేమ, సెంటిమెంట్, ఎమోషన్స్ మేళవించిన కథలో నటించడం ఆనందంగా ఉందని నాయకానాయికలు తెలిపారు. జయసుధ, కోటా శ్రీనివాసరావు, రావు రమేష్, అన్నపూర్ణమ్మ, రాజారవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.ఎల్.ఎన్.బాబు, సంగీతం: కె.ఎమ్.రాధాకృష్ణన్, నిర్మాణ సంస్థ: రోవాస్కైర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రచన-దర్శకత్వం: బాలాజీ సానల.

756

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles