సరికొత్త కథతో..


Thu,March 21, 2019 12:08 AM

Only Nenu But not alone Trailer Launch

సర్కడమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ఓన్లీ నేను. బట్ నాట్ ఎలోన్ అని ఉపశీర్షిక. చింగ్, పూర్వి టక్కర్ జంటగా నటిస్తున్నారు. శేషగిరిరావు నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్కడమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం వున్న బిలియనీర్స్‌లో మహిళల ప్రాతినిథ్యం శూన్యం. ఇదే అంశం చుట్టూ సాగే కథ ఇది. సరికొత్త కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. బిలియనీర్‌ల జాబితాలో చేరాలనుకున్న ఓ అమ్మాయి అందు కోసం ఏం చేసింది?. ఆ తరువాత ఆమెకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. కొత్త తరహా చిత్రాల్ని ఇష్టపడే వారికి తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది అన్నారు. ఆసక్తికరమైన మలుపులతో సాగే చిత్రిమిది. డిసెంబర్ 6 వరకు చిత్రాన్ని పూర్తి చేస్తాం అని నిర్మాత శేషగిరిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింగ్, పూర్వీటక్కర్, అమిటి, బాలచందర్, సంధ్యారెడ్డి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

671

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles