ఒక రాధ ముగ్గురు కృష్ణులు


Sat,May 19, 2018 10:20 PM

Oka Radha Mugguru Krishnulu Movie Audio Launch

Anusha
అభిషేక్, అభి, ఆకాష్, అనూష వేణుగోపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఒక రాధ ముగ్గురు కృష్ణులు. పరకోటి బాలాజీ దర్శకుడు. ధృవచరణ్ నిర్మాత. జయసూర్య స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు గురువారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యూత్‌పుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఓ రాధ ముగ్గురు కృష్ణుల మధ్య మొదలైన ప్రేమకథ చివరకు ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఆసక్తిని పంచుతుంది. వినోదానికి పెద్దపీట వేశం. జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. జంబలకిడిపంబ, చిత్ర భళారే విచిత్రం తరహాలో కడుపుబ్బా నవ్వించే చిత్రమిదని, ఇంటిల్లిపాదిని అలరిస్తుందని నిర్మాత చెప్పారు. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమినది, కథానుగుణంగా మూడు పాటలు అద్భుతంగా కుదిరాయని సంగీత దర్శకుడు యాజమాన్య అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటి, మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

3714

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles