ఒక ఏలియన్ ప్రేమకథ


Mon,July 8, 2019 11:47 PM

Oka Aliyan Prema katha The songs of the film

తిలక్, సుష్మా నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ఒక ఏలియన్ ప్రేమకథ. లెన్లీ దర్శకుడు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. పిఆర్‌కే ప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర గీతాలను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ మా స్వస్థలం కర్ణాటక. తెలుగు సినిమా చేయాలనే తపనతో ఇక్కడకొచ్చాను. ప్రేమను వెతుక్కుంటూ ఓ ఏలియన్ భూగ్రహానికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో హీరో సైనికాధికారిగా నటిస్తున్నాడు. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రుద్రమని, సంగీతం: వికాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లెన్లీ.

636

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles