మోస్ట్‌ వాంటెడ్‌ ‘రాధే’

Sun,October 13, 2019 12:11 AM

దర్శకుడిగా హిందీ చిత్రసీమలో తనదైన ముద్రవేశారు ప్రభుదేవా. ైస్టెలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన సల్మాన్‌ఖాన్‌తో ‘దబాంగ్‌-3’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాంటెడ్‌' (తెలుగు ‘పోకిరి’ రీమేక్‌) బాలీవుడ్‌లో పెద్ద విజయాన్ని సాధించింది. తాజా చిత్రం ‘దబాంగ్‌-3’ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇదిలావుండగా సల్మాన్‌-ప్రభుదేవా కాంబినేషన్‌లో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘రాధే’(ఇండియాస్‌ మోస్ట్‌వాంటెడ్‌ కాప్‌) పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సొహైల్‌ఖాన్‌ నిర్మాత. నవంబర్‌ 4న లాంఛనంగా ప్రారంభంకానుంది. కొరియన్‌ చిత్రం ‘ది అవుట్‌లాస్‌' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలిసింది. అండర్‌వరల్డ్‌ మాఫియా అంతుచూసే పోలీస్‌ అధికారి ఇతివృత్తంతో యాక్షన్‌ ప్రధానంగా ఈ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.
Salman-Khan

428

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles