సూరి అమెరికాయానం


Mon,March 18, 2019 11:56 PM

nuvvu thopu raa movie released april 26

సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం నువ్వు తోపురా. డి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. హరినాథ్‌బాబు.బి దర్శకుడు. ఏప్రిల్ 26న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ సూరి అనే మాస్ యువకుడి కథ ఇది. ఓ అవసరం అతడిని అమెరికాకు పయనమయ్యేలా చేస్తుంది. అదేమిటి? అక్కడ అతడికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. తెలంగాణ యాసలో సుధాకర్ చెప్పే సంభాషణలు కొత్త అనుభూతిని పంచుతాయి. సీనియర్ నటి నిరోషా పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సాల్ట్‌లేక్ సిటీతో పాటు అమెరికాలోని పలు అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. గీతా ఆర్ట్స్, జీ3 ఫిలిమ్స్ ద్వారా ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది అని తెలిపారు. రవివర్మ, శ్రీధరన్, దివ్యారెడ్డి, ఫిష్ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: ప్రకాష్ వేలాయుధమ్.

615

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles