‘నూటొక్క జిల్లాల అందగాడు’ ప్రారంభం

Mon,October 21, 2019 12:03 AM

అవసరాల శ్రీనివాస్‌ కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రుహాని శర్మ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. దిల్‌రాజు, క్రిష్‌ సమర్పణలో రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘వైవిధ్యమైన కథాంశమిది. ఆద్యంతం వినోదప్రధానంగా అలరిస్తుంది. అవసరాల శ్రీనివాస్‌ పాత్ర చిత్రణ నవ్యపంథాలో సాగుతుంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ్‌, ఆర్ట్‌: ఏ.రామాంజనేయులు, ఎడిటర్‌: కిరణ్‌ గంటి, సంగీతం: స్వీకార్‌ అగస్తి, డిజైనర్‌: ఐశ్వర్య రాజీవ్‌, రచన: అవసరాల శ్రీనివాస్‌, సమర్పణ: దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్‌.

561

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles