ఎవరూ ప్రపోజ్ చేయలేదు


Wed,May 22, 2019 11:28 PM

no one can propose to me says rakulpreetsingh

ఇప్పటివరకు తనకు ఎవరూ ప్రపోజ్ చేయలేదని అంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్. మంగళవారం ట్విట్టర్‌లో అభిమానులతో సరదాగా ముచ్చటించింది ఈ సొగసరి. నెటిజన్‌లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. తల్లిదండ్రులు తనను చూసి గర్వించే ప్రతిక్షణం ఆనందపడుతానని, తాను సరైన మార్గంలో ప్రయాణిస్తున్నాననడానికి అదే నిదర్శనమని చెప్పింది. అనుష్కశర్మ, అలియాభట్, కాజోల్ తన అభిమాన నాయికలని, సినిమాల్ని అమితంగా ప్రేమిస్తున్నానని తెలిపింది. స్వతహాగా తాను భోజనప్రియురాలినని, ఆరోగ్యకరమైన అన్ని రకాల ఆహారపదార్థాల్ని ఇష్టపడుతానని అంటోంది రకుల్. ఎంత తిన్నా బరువు మాత్రం పెరగకూడదన్నదే తన కల అని తెలిపింది. మీ గ్లామర్ సీక్రెట్ ఏమిటని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నిత్యం సంతోషంగా ఉండటమే అంటూ సమాధానమిచ్చింది. నచ్చిన ప్రదేశాల గురించి చెబుతూ నేను వెళ్లే చోటుకంటే నాతో ఉండే మనుషులు ఎవరన్నదే ముఖ్యమని, లండన్ తన ఫేవరేట్ హాలీడే డెస్టినేషన్ అని తెలిపింది రకుల్.

922

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles