మర్డర్ మిస్టరీ


Mon,February 18, 2019 11:12 PM

Nizam Pilladu release the film on March 29

జాతీయ బాడీబిల్డర్ బల్వాన్ హీరోగా, ప్రాచీ అధికారి, మౌనిక హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం నైజాం పిల్లోడు. ఎస్‌ఎమ్‌ఎమ్ ఖాజా దర్శకత్వంలో మజ్ను రెహానా బేగం, మజ్ను సోహ్రాబ్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఒక్క పాట మినహా టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలోని పాటలను త్వరలో విడుదల చేస్తాం. సంగీత దర్శకుడు మజ్ను కథకు సరిపోయే మంచి బాణీలను అందించాడు అని తెలిపారు. నలభై ఐదు చిత్రాల్లో ఫైటర్‌గా నటించిన బల్వాన్ ఈ చిత్రంలో హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలకు నచ్చే అంశాలున్నాయని దర్శకుడు తెలియజేశాడు. సంపత్‌రాజ్, ఫిరోజ్, దిల్ రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : యాదగిరి, సమర్పణ: మజ్ను బ్రదర్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత :ఫీష్ లక్ష్మీ.

1693

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles