అఖిల్ జోడీగా..


Mon,July 8, 2019 12:04 AM

Nivetha Pethuraj roped in for Allu Arjun film with Trivikram Srinivas

మెంటల్ మదిలో చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది తమిళ సొగసరి నివేథా పేతురాజ్. తొలి సినిమాలోనే అందం, అభినయం కలబోతగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అక్కినేని అఖిల్ సరసన నివేథా పేతురాజ్ నటించబోతున్నది తెలిసింది. వివరాల్లోకి వెళితే..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలో చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఇందులో అఖిల్‌కు జోడీగా నివేథా పేతురాజ్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. చిత్రలహరి బ్రోచేవారెవరురా సినిమాలతో యువతరంలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది నివేథా పేతురాజ్. ప్రస్తుతం ఈ సుందరి అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నది. చిత్రసీమలో అరంగేట్రం చేసిన అనతికాలంలో ఈ తమిళ సోయగం భారీ సినిమా అవకాశాలతో తారాపథంలో దూసుకుపోతున్నది.

2006

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles