చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో

Fri,March 22, 2019 12:08 AM

శ్రీనివాసకల్యాణం తర్వాత సినిమాలేవీ అంగీకరించలేదు నితిన్. గత ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలకు కొంత విరామం తీసుకున్నారాయన. త్వరలోనే తదుపరి సినిమా విశేషాల్ని వెల్లడిస్తానని ఇటీవలే ట్విట్టర్ ద్వారా అభిమానులకు మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకున్న ఆయన హోలీ పండగ సందర్భంగా గురువారం కొత్త సినిమాను ప్రకటించారు. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో ఓ సినిమా చేయనున్నట్లు తెలిపారు. ప్రతిభావంతుడైన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో నా తదుపరి సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్‌ప్రసాద్ నిర్మించనున్నారు. కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. ఏప్రిల్ నెలలో చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలో వెల్లడిస్తాను అని నితిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాతో పాటు రమేష్‌వర్మ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

1532

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles