మిషన్ మంగళ్


Mon,February 4, 2019 10:43 PM

nithya mission mission mangal

ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) చేపట్టిన మార్స్ ఆర్బిటరీ మిషన్ (మామ్) నేపథ్యంలో హిందీలో రూపొందిస్తున్న చిత్రం మిషన్ మంగళ్. అంగారక కక్ష్యలోకి శాటిలైట్‌ను పంపించి పరిశోధనలు చేసిన భారత సైంటిస్టుల బృందం విజయగాథ స్ఫూర్తిగా కాల్పనిక అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అక్షయ్‌కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యామీనన్, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలో నిత్యామీనన్‌కు సంబంధించిన చివరిరోజు షూటింగ్ ఫొటోల్ని అక్షయ్‌కుమార్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. నిత్యామీనన్ నటిస్తున్న తొలి హిందీ చిత్రమిదే కావడం విశేషం. సైంటిఫిక్ ఇతివృత్తంతో భారీస్థాయిలో రూపొందుతున్న చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం కావడం ఆనందంగా ఉందని నిత్యామీనన్ పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదలకానుంది.

839

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles