తల్లి పాత్రలో..


Fri,September 6, 2019 11:09 PM

Nithya Menen film is titled Aaram Thirukalpana

ప్రస్తుత పోటీ తరుణంలో కథానాయికలు ఐదారు సినిమాలు పూర్తయ్యేలోగా తెరమరుగైపోతున్నారు. అలాంటిది హాఫ్ సెంచరీ పూర్తిచేయడం అంతా సులభం కాదు. జయాపజయాలకు అతీతంగా నిత్యామీనన్ యాభై సినిమాల మైలురాయికి చేరుకున్నది. గ్లామర్ పాత్రలకు దూరంగా నమ్మిన విలువలకు కట్టుబడి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ దక్షిణాది చిత్రసీమలో రాణిస్తున్నది ఈ సొగసరి. ఆమె కథానాయికగా నటిస్తున్న యాభయ్యవ సినిమాకు ఆరం తిరుకల్పన అనే పేరును ఖరారుచేశారు. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంకానున్నట్లు నిత్యామీనన్ తెలిపింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ తల్లిపాత్రలో కనిపించబోతున్నది. పోలీస్ అధికారికి, మహిళకు మధ్య జరిగే కథ ఇదని, రెండు కాలాల వ్యవధుల్లో వినూత్నంగా ఉంటుందని దర్శకుడు అజయ్ దేవలోక పేర్కొన్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించనున్నట్లు ప్రకటించారు. మిషన్ మంగళ్ సినిమాతో ఇటీవలే బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది నిత్యామీనన్.

346

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles