ఆమె మాటలు కన్నీళ్లు తెప్పించాయి!


Mon,July 22, 2019 12:01 AM

Ninu Veedani Needanu Nene Thanks Meet  Sundeep Kishan Anya Singh Thaman

సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించిన నిను వీడని నీడను నేనే చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. కార్తీక్‌రాజు దర్శకుడు. అన్యాసింగ్ కథానాయిక. దయా పన్నెం, సందీప్‌కిషన్, వీజీ సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. శనివారం హైదరాబాద్‌లో థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్‌కిషన్ మాట్లాడుతూ విడుదలైన రోజున మూడుగంటల వరకు సినిమా ఫలితం ఏమిటో అర్థంకాలేదు. ఆ తర్వాత అందరూ ఫోన్ చేసి అభినందించడం మొదలుపెట్టారు. ఇండస్ట్రీలోని పెద్దవాళ్లు కొందరు క్యూబ్‌లో షో వేయించుకొని చూసి మెచ్చుకున్నారు. రోడ్డుమీద నిలబడితే జనాలు పరుగెత్తుకొచ్చి..సినిమా చూశాం, చాలా బాగుంది అంటూ సీన్స్ గురించి చర్చిస్తున్నారు. మదర్‌సెంటిమెంట్ బాగుందని చెబుతున్నారు. అదే నిజమైన విజయమని భావిస్తున్నా.

ఈ సినిమా విషయంలో అమ్మనాన్న బంధం తాలూకు భావోద్వేగాల్ని బాగా విశ్వసించాను. ఆ నమ్మకంతోనే ముందుకెళ్లాను. ఇప్పుడు అదే ఈ విజయాన్ని అందించిందనుకుంటున్నాను. విశాఖపట్నం నుంచి ఒకపెద్దావిడ ఫోన్ చేసి మా అబ్బాయి మూడునెలల క్రితం ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సినిమా అంతకుముందే వచ్చిఉంటే ప్రాణాలు తీసుకునే ముందు మా గురించి ఆలోచించేవాడేమో అని చెప్పినప్పుడు నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. కథను నమ్మి నిజాయితీతో చేసిన ప్రయత్నం ఫలించడం ఆనందంగా ఉంది అన్నారు. దేవుడు సందీప్‌కిషన్ కష్టాన్ని గుర్తించి అపూర్వ విజయాన్ని అందించాడని సంగీత దర్శకుడు తమన్ చెప్పారు. నిర్మాతగా తమ తొలి చిత్రం చక్కటి ప్రేక్షకాదరణకు నోచుకోవడం ఆనందంగా ఉందని దయా పన్నెం తెలిపారు. ఈ సినిమా ద్వారా తనకు తెలుగు పరిశ్రమలో ఘనస్వాగతం లభించిందని కథానాయిక అన్యాసింగ్ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

725

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles