హాకీ ఆట నేపథ్యంలో

Mon,October 7, 2019 12:11 AM

నిను వీడని నీడను నేనే చిత్రంతో తిరిగి విజయాల బాట పట్టారు సందీప్‌కిషన్. ఈ సక్సెస్ అనంతరం కథల ఎంపికలో వైవిధ్యతకు ప్రాముఖ్యతనిస్తున్న ఆయన తాజాగా హాకీ క్రీడాకారుడిగా అవతారమెత్తనున్నారు. సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించనున్న తాజా చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్‌కిషన్, దయాపన్నెం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో హకీ స్టిక్ పట్టుకొని స్టేడియం ముందు ధీమాగా నిల్చొని కనిపిస్తున్నారు సందీప్‌కిషన్. హాకీ నేపథ్యంలో రానున్న తొలి తెలుగు చిత్రమిది. న్యూఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌గా తెలుగు ప్రేక్షకులకు నవ్యమైన అనుభూతిని పంచుతుంది. హాకీ ప్లేయర్‌గా సందీప్‌కిషన్ పాత్ర నవ్యపంథాలో ఉంటుంది. నవంబర్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. 2020లో ఈ చిత్రాన్ని విడుదలచేస్తాం అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.

274

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles