ప్రేమ జ్ఞాపకాలతో..


Thu,September 5, 2019 10:32 PM

Ninnu Thalachi Movie Release Date Announcement Press Meet

వంశీ, స్టెఫీ పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం నిన్ను తలచి. అనిల్ తోట దర్శకత్వం వహిస్తున్నారు. ఓబులేష్, నేదురుమల్లి అజిత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 27న విడుదలకానుంది. గురువారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అభి, అంకిత అనే జంట కథ ఇది. స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుంది అని అన్నారు. హీరోగా ఇదే తన తొలి చిత్రమని, రొటీన్‌కు భిన్నమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం నవ్యమైన అనుభూతిని పంచుతుందని వంశీ పేర్కొన్నారు. స్టెఫీ పటేల్ మాట్లాడుతూ ప్రేమ జ్ఞాపకాలకు దృశ్యరూపమిది. అంకిత పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయడానికి హీరో వంశీ చక్కటి సహకారాన్ని అందించారు అని చెప్పింది. కథే ఈ సినిమాకు హీరో అని, కొత్తదనాన్ని నమ్మి ఈసినిమాను రూపొందించామని నిర్మాతలు తెలిపారు.

361

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles